HYD-కూకట్‌పల్లి కల్తీ కల్లు వ్యవహారంలో ఎక్సైజ్ శాఖ సీరియస్ అయ్యింది. బాలానగర్ ఎక్సైజ్ SHO వేణు కుమార్‌ను సస్పెండ్ చేసింది. మరో నలుగురు అధికారుల పాత్రపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఘటనలో అధికారులు ఐదు బృందాలుగా ఏర్పడి బాధితుల వివరాలు సేకరిస్తున్నారు. HMT హిల్స్, సర్డార్ పటేల్ నగర్, హైదర్ నగర్ కల్లు దుకాణాల లైసెన్సులు సీజ్ చేశారు. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా.. పదుల సంఖ్యలో బాధితులు చికిత్స పొందుతున్నారు.