తెలుగు రాష్ట్రాల్లో ఆస్తి పన్ను బకాయిల చెల్లింపుపై ఉన్న రాయితీ గడువు మార్చి 31తో ముగియనుంది. ఆంధ్రప్రదేశ్‌లో బకాయిలపై వడ్డీలో 50% రాయితీ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలోని GHMC పరిధిలో వడ్డీపై 90% భారీ మినహాయింపు (వన్ టైమ్ స్కీమ్) అమలవుతోంది. పన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పెనాల్టీల నుంచి ఉపశమనం పొందవచ్చు.