TG: రాష్ట్రంలో చేయూత కొత్త పింఛన్ల దరఖాస్తుల పరిశీలన గడువు ఈనెల 30 వరకు పొడిగిస్తూ సెర్ప్ నిర్ణయం తీసుకుంది. ఎస్ఐఆర్, నిమజ్జనం వల్ల పింఛన్ల దరఖాస్తుల పరిశీలన పూర్తి కాలేదని అధికారులు విజ్ఞప్తి చేశారు. దీంతో మరో ఐదు రోజులపాటు గడువు ఇచ్చింది. కాగా అక్టోబర్ నుంచి ప్రభుత్వం కొత్త పింఛన్లు లబ్ధిదారులకు అందజేయనుంది.