టీచర్లకు రేపటి నుంచి ఫేషియల్ రికగ్నిషన్ హాజరు అమలు

TG: రాష్ట్రంలోని గవర్నమెంట్ టీచర్లకు శుక్రవారం (ఆగస్టు1) నుంచి ఫేషియల్ రికగ్నిషన్ హాజరు నిబంధన అమల్లోకి రానుంది. ప్రభుత్వ బడులు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, జనరల్ గురుకులాల్లోని 1.20లక్షల మంది టీచర్లకు ఇది వర్తించనుంది. అయితే కొంతమంది ఉపాధ్యాయులు సమయపాలన పాటించకపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విధులకు హాజరు కాకుండా జీతాలు తీసుకున్న ఘటనల నేపథ్యంలో ఈ రూల్ అమలు చేయనుంది.

సంబంధిత పోస్ట్