తెలంగాణ రైతుల కళ్లల్లో ఆనందం చూడటం కోసమే రైతు భరోసా ఇస్తున్నామని CM రేవంత్ అన్నారు. భూమిలేని పేద రైతులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి రూ.12 వేలు ఇస్తున్నామని చెప్పారు. 'పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు అని చెప్పగానే వైఎస్ఆర్ గుర్తుకు వస్తారు. ఇవాళ అర్ధరాత్రి నుంచే రైతుల ఖాతాల్లో రైతు భరోసా నగదు జమ అవుతుంది. ప్రతి పేదవానికి ఇళ్లు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిది. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేశాం' అని తెలిపారు.