బీహార్ మహిళా పోలీసులకు హెడ్ క్వార్టర్స్ కీలక ఆదేశాలు జారీ చేసింది. డ్యూటీలో ఉన్నప్పుడు నగలు, మేకప్ వాడకూడదని స్పష్టం చేసింది. కానిస్టేబుళ్ల నుంచి సీఐల వరకు ఈ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంది. మహిళా పోలీసులు యూనిఫాం, ఆభరణాలు ధరించి మేకప్‌తో చేస్తున్న రీల్స్ వైరల్ కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీనిని ఉల్లంఘిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని పేర్కొంది. ఇది పోలీసు మర్యాద, వృత్తి నైపుణ్యానికి మచ్చ అని తెలిపింది.