బిల్లులపై మూడు నెలల్లోగా తుది నిర్ణయం తీసుకోవాలి: సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. గవర్నర్లు రాష్ట్రపతికి పంపే బిల్లులపై నిర్ణయం తీసేందుకు గడువు ఉండాలని స్పష్టం చేసింది. రాష్ట్రపతి మూడు నెలల్లోగా వాటిపై తుది నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఒకవేళ జాప్యం జరిగితే రాష్ట్ర ప్రభుత్వానికి కారణాలు తెలపాలని పేర్కొంది. రాష్ట్రపతి ఆమోదం తెలపకపోతే .. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించవచ్చని వెల్లడించింది. అయితే రాష్ట్రపతికి సుప్రీం గడువు విధించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం

సంబంధిత పోస్ట్