హైదరాబాద్ జంట నగరాల్లోని బహిరంగ ప్రదేశాలు, కంటోన్మెంట్ ప్రాంతాల్లో బాణాసంచా కాల్చడం నిషేధమని సీపీ ఆనంద్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆకస్మిక శబ్దాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయొద్దని విజ్ఞప్తి చేశారు. బాణసంచా పేలుళ్లను ఉగ్ర కార్యకలాపాలుగా తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉందన్నారు. హైదరాాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ 1348 సెక్షన్ 67(C) ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.