హైదరాబాద్‌లో రాత్రి 10 నుంచి ఫ్లైఓవర్లు బంద్

నూతన సంవత్సర వేడుకలను ప్రశాంతంగా నిర్వహించేందుకు హైదరాబాద్ పోలీసులు కఠిన ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31 రాత్రి 11 గంటల నుంచి జనవరి 1 తెల్లవారుజామున 2 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. బేగంపేట, టోలీచౌకీ ఫ్లైఓవర్లకు మినహాయింపుతో, మిగిలిన ఫ్లైఓవర్లు రాత్రి 10 గంటల నుంచి మూసివేయబడతాయి. నగరంలోకి వచ్చే ప్రైవేటు వాహనాలను ఔటర్ రింగ్ రోడ్ మీదుగా మళ్లించనున్నారు. ట్యాంక్‌బండ్, నెక్లస్ రోడ్, ఎన్‌టీఆర్ మార్గ్ వంటి రద్దీ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు పూర్తిగా నిషేధం. 217 చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తారు.

సంబంధిత పోస్ట్