షూటింగ్‍లో మాజీ డీజీపీ అంజనీ కుమార్‍కు గోల్డ్ మెడల్

TG: HYD గచ్చిబౌలిలోని SATS షూటింగ్ రేంజ్‌లో జరిగిన తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ మాజీ డీజీపీ అంజనీ కుమార్ 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో గోల్డ్ మెడల్ సాధించారు. ప్రజా సేవతో పాటు క్రీడారంగంలోనూ తన ప్రతిభను చాటుకున్న అంజనీ కుమార్, యువ క్రీడాకారులకు దీటుగా రాణించి, స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ వయసులోనూ ఆయన సాధించిన విజయం అనేకమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది.

సంబంధిత పోస్ట్