బంగ్లాదేశ్‌లో గతేడాది జరిగిన అల్లర్ల ఘటనకు సంబంధించి ఢాకాలోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ కోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణలో ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనాను దోషిగా తేల్చిన న్యాయస్థానం.. ఆమెకు మరణశిక్ష విధించింది. ఈ అల్లర్లలో అనేకమంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో హసీనాపై హత్య సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.