దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడికి మరో 30 ఏళ్ల జైలు శిక్ష

దక్షిణ కొరియాలో మార్షల్ లా విధించిన కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న మాజీ అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యేల్‌కు.. 2024 అక్టోబర్‌లో ఉత్తర కొరియాలోకి డ్రోన్లు పంపినందుకు గాను మరో 30 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. కిమ్‌ సేనను రెచ్చగొట్టేందుకే ఈ ఆదేశాలు జారీ చేసినట్లు కోర్టు పేర్కొంది. యూన్‌తో పాటు ఆయన మాజీ రక్షణ మంత్రి కిమ్ యోంగ్ హ్యూన్‌, డిఫెన్స్ కౌంటర్‌ ఇంటెలిజెన్స్ కమాండ్ మాజీ అధిపతి యో ఇన్ హ్యూంగ్, డ్రోన్ ఆపరేషన్స్ కమాండ్స్ మాజీ అధిపతి కిమ్ యోంగ్-డేలను కూడా న్యాయస్థానం దోషులుగా నిర్ధారించి, జైలు శిక్ష విధించింది.

సంబంధిత పోస్ట్