అంతరిక్ష రంగంలో చైనా మరో కీలక ఘనత సాధించింది. కేవలం 45 గంటల్లో నాలుగు రాకెట్లను విజయవంతంగా ప్రయోగించింది. సెప్టెంబర్ 15, 16 తేదీల్లో మూడు లాంచింగ్ కేంద్రాల నుంచి జరిగిన ఈ ప్రయోగాల్లో ప్రైవేట్, ప్రభుత్వ సంస్థలకు చెందిన రాకెట్లు ఉన్నాయి. ఝుక్వీ-2ఈ ద్వారా 10 ఉపగ్రహాలు, గ్రావిటీ-1 ద్వారా 9, లాంగ్ మార్చ్-12 ద్వారా మరో 9 ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరాయి. కుయ్‌ఝౌ-11 రాకెట్ రెండు రాడార్ ఉపగ్రహాలను విజయవంతంగా ప్రవేశపెట్టింది. దీంతో తక్కువ వ్యవధిలో వరుస ప్రయోగాలతో చైనా తన రాకెట్ సామర్థ్యాన్ని మరోసారి చాటిచెప్పింది.