దివ్యాంగులకు ఉచితంగా 5G ఫోన్లు, బ్యాటరీ సైకిళ్లు

TG: దివ్యాంగులకు మొబైల్ బిజినెస్ బ్యాటరీ ట్రై సైకిళ్లు, వీల్ చైర్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, 5G స్మార్ట్ ఫోన్లు ఫ్రీగా ఇవ్వనున్నట్లు దివ్యాంగుల కో-ఆపరేటివ్ కార్పొరేషన్ ఛైర్మన్ వీరయ్య వెల్లడించారు. ఇందుకోసం https://tgobmms.cgg.gov.in/ పోర్టల్‌లో ఈ నెల 10లోగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. గతంలో అప్లై చేసి పరికరాలు పొందని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. వివరాలకు 9959583502 నంబర్(10am-6pm)లో సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్