ఇళ్లకు ఉచితంగా విద్యుత్ కనెక్షన్లు

TG: రాష్ట్రంలోని ఇళ్లకు విద్యుత్ సరఫరా కనెక్షన్లను ఉచితంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ కమిషన్ చేసిన సిఫార్సును ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఇళ్లకు కనెక్షన్ ఏర్పాటు చేయడానికి అవసరమైన విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలకు అయ్యే ఖర్చును వినియోగదారుడి నుంచి వసూలు చేసేవారు. ఇకపై ఉచితంగా అందుతుంది.

సంబంధిత పోస్ట్