ఆధార్‌తో ఉచిత ఈమెయిల్ అప్‌డేట్.. రేపటి నుంచే అమలు

భారతదేశ ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్‌ కార్డ్‌లో ఈమెయిల్ ఐడీని అప్‌డేట్ లేదా మార్పు చేసుకునే సేవలను పూర్తిగా ఉచితం చేసింది. ఈ సదుపాయాన్ని జూలై 1 నుండి డిసెంబర్ 31 వరకు ఆరు నెలల పాటు వినియోగించుకోవచ్చు. సాధారణంగా ఈమెయిల్ అప్‌డేట్‌కు రూ.75 వరకు రుసుము చెల్లించాల్సి ఉంటుంది, అయితే ఈ కాలంలో ఆ రుసుము పూర్తిగా రద్దు చేయబడింది. ఈ ఉచిత సదుపాయం కేవలం అధికారిక ఆధార్ మొబైల్ యాప్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆధార్ కేంద్రాలకు లేదా ఇతర ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లకు ఈ మినహాయింపు వర్తించదు.

సంబంధిత పోస్ట్