పీఎఫ్ ఖాతాదారులకు రూ.7 లక్షల ఉచిత బీమా

ప్రైవేట్ రంగ ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ (EPFO) ఒక శుభవార్తను అందించింది. ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ (EDLI) 1976 కింద, ప్రతి ఈపీఎఫ్ సభ్యునికి రూ.7 లక్షల వరకు ఉచిత బీమా కవరేజీ లభిస్తుంది. దీనికోసం ఉద్యోగి ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. కంపెనీలు ఉద్యోగి ప్రాథమిక జీతం, DAలో 0.50% చెల్లిస్తాయి. ఉద్యోగి మరణిస్తే, నామినీకి కనీసం రూ.2.5 లక్షలు, గరిష్టంగా రూ.7 లక్షలు లభిస్తాయి. ఈ మొత్తాన్ని గత 12 నెలల సగటు జీతం, పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ ఆధారంగా లెక్కిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్