ఉచిత పథకాలు అర్హులకే అందాలి: సుప్రీంకోర్టు

దేశంలో రాజకీయ పార్టీలు ఎన్నికల్లో గెలుపు కోసం ఉచిత పథకాలకు పెద్దపీట వేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇటీవల తమిళనాడులో 100 యూనిట్ల విద్యుత్ ను ఉచితంగా అందిస్తామన్న హామిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎన్నికల ముందు ఉచితాలను ప్రకటించడం, విచక్షణారహితంగా నిధులు పంచడం దేశ దీర్ఘకాలిక ఆర్థిక అభివృద్ధికి మంచిది కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఉచితాల భారం పన్నులు చెల్లిస్తున్నవారిపై పడుతుందని, ఈ పరిస్థితి మారాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

సంబంధిత పోస్ట్