రైళ్లలో వృద్ధులకు, 45 ఏళ్లు పైబడిన మహిళలకు లోయర్ బెర్తులు కేటాయించనున్నట్టు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. టికెట్ బుకింగ్ సమయంలో ఎంపిక చేయకపోయినా, అందుబాటులో ఉంటే ఆటోమేటిక్‌గా కింది బెర్తులు ఇచ్చే విధానం అమల్లో ఉందన్నారు. స్లీపర్, 3AC కోచ్‌లలో పెద్దలు, 45+ మహిళల కోసం ప్రత్యేకంగా బెర్తులు రిజర్వ్ చేశామని రాజ్యసభలో వెల్లడించారు. దివ్యాంగులు, వారి సహాయకుల కోసం కూడా ఇలాంటి కేటాయింపులు ఉన్నట్లు తెలిపారు.