ఇకపై మండల స్థాయిలోనూ ప్రజావాణి: సర్కార్

TG: సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై మండల స్థాయిలోనూ ప్రజావాణి నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అన్ని మండలాల్లో ప్రజావాణి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించునున్నారు. ఈ నిర్ణయం ద్వారా ప్రజల సమస్యలను స్థానిక స్థాయిలోనే పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేయనుంది.

సంబంధిత పోస్ట్