TG: రాష్ట్ర ప్రజలకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఆర్టీసీ సేవలను మరింత విస్తరించనున్నట్లు రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇక నుంచి ప్రతీ పల్లెకు ఆర్టీసీ బస్సులను తిప్పనున్నట్లు తాజాగా ప్రకటించారు. రోడ్డు సౌకర్యం ఉన్న ప్రతీ గ్రామానికి ఆర్టీసీ బస్సులు తిరిగేలా చర్యలు చేపట్టమన్నారు. త్వరలోనే కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతామని, దీని వల్ల కాలుష్యం తగ్గుతుందన్నారు.