భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ (FSSAI) న్యూస్ పేపర్లలో ఆహారాన్ని ప్యాక్ చేయడం లేదా వడ్డించడంపై తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. న్యూస్ పేపర్లలోని సిరాలో ఉండే సీసం, ఇతర రసాయనాలు ఆహారంలో కలిసి కాలేయం, మెదడు దెబ్బతినడానికి కారణమవుతాయని, ముఖ్యంగా గర్భిణులు, పిల్లలపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని సంస్థ తెలిపింది. ఆహారం కోసం పేపర్ల వాడకాన్ని నిషేధించినట్లు, ఉల్లంఘిస్తే FSSAI యాప్ లేదా టోల్-ఫ్రీ నంబర్ 1800-11-2100 ద్వారా ఫిర్యాదు చేయవచ్చని పేర్కొంది.