రాష్ట్రంలో ఇంధన నిల్వలు సరిపడా ఉన్నాయి: పౌర సరఫరాల శాఖ

TG: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ సరఫరాలో ఎలాంటి కొరత లేదని, ఇంధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. నిన్న డిమాండ్‌ను మించి పెట్రోల్, డీజిల్ సరఫరా చేశామని, ఒక్కరోజే 29,939 లీటర్ల పెట్రోల్, డీజిల్ సరఫరా చేశామని వెల్లడించారు. సగటున రోజుకు 5,883 లీటర్ల పెట్రోల్, 7,348 లీటర్ల డీజిల్‌కు డిమాండ్ ఉండగా, నిన్న 11,490 లీటర్ల పెట్రోల్, 18,449 లీటర్ల డీజిల్ సరఫరా చేశామన్నారు. పెట్రోల్ కంపెనీల ప్రతినిధులతో సమీక్షిస్తున్నామని, అపోహలతో ఇంధనాన్ని అధికంగా కొని నిల్వ చేసుకోవద్దని ప్రజలకు సూచించారు.

సంబంధిత పోస్ట్