టీబీ రోగులకు నిలిచిపోయిన నిధులు బంద్.. 16 నెలలుగా నిరీక్షణ!

TG: రాష్ట్రంలో టీబీ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన నిక్షయ్ పోషణ నిధులు 16 నెలలుగా నిలిచిపోయాయి. నెలకు రూ.1000 చొప్పున అందాల్సిన ఈ ఆర్థిక సాయం అందక వేలాది మంది పేద రోగులు పౌష్టికాహారానికి దూరమవుతున్నారు. కేంద్రం 60%, రాష్ట్రం 40% భరించాల్సిన ఈ పథకంలో కేంద్రం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో రాష్ట్ర వాటా కూడా నిలిచిపోయింది. 2023లో 74,994 కేసులు నమోదు కాగా, 47,728 మందికే సాయం అందింది. 2024లో 76,611 కేసులు నమోదు కాగా, 37,350 మందికే సాయం అందింది. ఈ ఏడాది ఇప్పటివరకు 47 వేల మందికి పైగా రోగులు నమోదైనా, ఒక్కరికి కూడా పైసా అందలేదు.

సంబంధిత పోస్ట్