ఉచిత తాగునీటి పథకానికి నిధులు విడుదల

TG: రాష్ట్రంలో ప్రజా మౌలిక సదుపాయాలు, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతం చేస్తూ ఆర్థిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నగర ప్రజలకు ఉచిత తాగునీటి పథకం రీయింబర్స్‌మెంట్ కింద జలమండలికి రూ.75 కోట్లు విడుదల చేసింది. అలాగే, అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాల కోసం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి రూ.414 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో నీటి సరఫరా మెరుగుపడటంతో పాటు, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు మార్గం సుగమం కానుంది.

సంబంధిత పోస్ట్