ప్రభుత్వ కళాశాలలో చదువుకుంటూ ఈఏపీసీఈటీలో అద్భుతమైన ర్యాంకులు సాధించడం ఎంతో గొప్ప విషయమని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఈఏపీసీఈటీలో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలని సూచించారు.