మహబూబ్ నగర్: బాలికల హాస్టల్లో కలెక్టర్, ఎస్పీ తనిఖీలు

మహబూబ్ నగర్ లోని డిగ్రీ కాలేజ్ బాలికల హాస్టల్ ను జిల్లా ఎస్పీ జానకీ, వివిధ శాఖల మహిళా అధికారులతో కలిసి శనివారం రాత్రి కలెక్టర్ సందర్శించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఆదేశించారు. వంట గది, స్టోర్ రూమ్ లను కలెక్టర్ పరిశీలించారు. తాజా కూరగాయలు, ఆకు కూరలు అందించేలా కాంట్రాక్టర్ కు సూచించాలని ప్రిన్సిపాల్ జయప్రదను కలెక్టర్ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్