మహబూబ్ నగర్: లోక్ అదాలత్ 3, 416 కేసులు పరిష్కారం: ఎస్పి

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్ లో భాగంగా వివిధ కోర్టుల పరిధిలోని మొత్తం 3,416 కేసులు పరిష్కరించబడ్డాయని జిల్లా ఎస్పీ డి. జానకి తెలిపారు. ఇందులో 524 ఐపీసీ కేసులు, 794 డీడీ కేసులు, 1,979 ఈ పెట్టి కేసులు, 119 సైబర్ క్రైమ్ కేసులు ఉన్నాయి. ఈ కేసుల పరిష్కారంతో బాధితులకు తక్షణ న్యాయం లభించడమే కాకుండా, కోర్టులపై భారం కూడా తగ్గిందని ఎస్పీ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్