మహబూబ్ నగర్: జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసుల ఆకస్మిక తనిఖీలు

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బండమీదిపల్లిలో ట్రాఫిక్ పోలీస్ శాఖ గురువారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రిపుల్ రైడింగ్, వితౌట్ హెల్మెంట్, ఆర్ సి, పెండింగ్ చలాన్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ గోపాల్ నాయక్ మాట్లాడుతూ.. యువత చెడు వ్యసనాలను వీడి సన్మార్గంలో నడవాలని మద్యం తాగి వాహనాలు నడపవద్దన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్