మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ జానకి హెచ్చరిక

రైతులు పండించిన ధాన్యాన్ని రోడ్లపై ఆరబోసి ప్రమాదాలకు కారణం కావద్దని మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ జానకి ధరావత్ హెచ్చరించారు. అతి వేగంగా రోడ్లపై ప్రయాణించే వాహనదారులు రోడ్లపై కుప్పలుగా ఉన్న ధాన్యాన్ని గమనించకపోవడంతో ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు. రోడ్లపై ధాన్యం కుప్పలు పోసి వాటిపై నల్ల కవర్లు కప్పడంతో రాత్రి సమయంలో అవి కనిపించడం లేదని, ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయే అవకాశం ఉంటుందన్నారు.

సంబంధిత పోస్ట్