నాగర్ కర్నూల్: త్రాగునీటి వసతులు పరిశీలించిన కలెక్టర్

నాగర్ కర్నూల్ పట్టణంలోని మిషన్ కాంపౌండ్ కాలనీ, బీసీ కాలనీలో త్రాగు నీటి వసతులను, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ దేవ సహాయం, జిల్లా కలెక్టర్ బడవత్ సంతోష్ పరిశీలించారు. కాలనీ ప్రజలతో కలిసి అందుబాటులో ఉన్న నీటి సరఫరా వ్యవస్థను పరిశీలించారు. నీటి సరఫరా సంబంధిత మౌలిక సదుపాయాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. త్రాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వ యంత్రాంగం కృషి చేస్తుందని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్