నారాయణపేట: సంక్రాంతికి ఇతర ప్రాంతాలకు వెళ్లెవారు జాగ్రత్తలు తీసుకోవాలి

సంక్రాంతి పండుగకు ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని నారాయణపేట ఎస్పీ యోగేష్ గౌతమ్ సూచించారు. దూర ప్రాంతాలకు వెళ్లే వారు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని, విలువైన వస్తువులు ఇంట్లో పెట్టకుండా వుండటం మంచిదని అన్నారు. ఇంటి బయట తప్పని సరిగా లైట్లు వేసి ఉంచాలని చెప్పారు. వాహనాలకు హ్యాండిల్ లాక్ వేయాలని అన్నారు. ఇంటిని గమనిస్తూ వుండాలని పక్కింటి వారికి చెప్పి వెళ్ళాలని అన్నారు.

సంబంధిత పోస్ట్