సంక్రాంతి పండుగ సందర్భంగా ఊళ్లకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని, విలువైన వస్తువులను లాకర్లలో భద్రపరచుకోవాలని వనపర్తి జిల్లా ఎస్పీ సునీత రెడ్డి సూచించారు. పండుగ సమయంలో దొంగతనాలు జరిగే అవకాశం ఉందని, ముందుగా పోలీసులకు సమాచారం ఇస్తే ఆయా ఇళ్లపై నిఘా పెంచుతామని తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.