వనపర్తి: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి: కలెక్టర్

విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం వనపర్తి జిల్లా వెల్టురులోని జ్యోతిభా పులే రెసిడెన్షియల్ పాఠశాల, కొత్తకోట మండలం అమడబాకుల జూనియర్ కళాశాల వసతిగృహాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతిగృహాల్లో ఆహార పదార్థాల నాణ్యత, వాటి గడువు తేదీలను పరిశీలించి, స్టాక్ రిజిస్టర్ ను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్