గణేషుడి నిమజ్జనం.. నేడు మెట్రో సేవలు పొడిగింపు

TG: హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, హైదరాబాద్ మెట్రో రైల్ శుక్రవారం, సెప్టెంబర్ 25న అర్ధరాత్రి 1:00 గంటల వరకు మెట్రో సేవలను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. మియాపూర్, ఎల్బీనగర్, నాగోల్, రాయదుర్గ్, జేబీఎస్, ఎంజీబీఎస్ టెర్మినల్స్ నుంచి చివరి మెట్రో అర్ధరాత్రి 1:00 గంటలకు బయలుదేరుతుంది. రెడ్, బ్లూ, గ్రీన్ కారిడార్లన్నింటికీ ఈ సేవలు వర్తిస్తాయి. రోడ్లపై ట్రాఫిక్ ఆంక్షల దృష్ట్యా ప్రయాణికులు మెట్రో సేవలను ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్

✕
✕