మరింత తగ్గనున్న గ్యాస్ ధరలు

అమెరికా నుంచి ఎల్‌పీజీని దిగుమతి చేసుకునేందుకు కీలక ఒప్పందం కుదిరిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ తెలిపారు. దీనివల్ల రానున్న రోజుల్లో గ్యాస్ సిలిండర్ల ధర మరింత తగ్గే అవకాశం ఉందని వెల్లడించారు. ఇండియన్ కంపెనీలు 2.2MTPA ఎల్‌పీజీని దిగుమతి చేసుకుంటాయని, ఇది మొత్తం వార్షిక దిగుమతుల్లో 10 శాతానికి సమానమని అన్నారు. ప్రజలకు మరింత తక్కువ ధరకు ఎల్‌పీజీని అందించడంలో ఇదొక ముందడుగు అని మంత్రి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్