అక్టోబర్‌- డిసెంబర్‌లో 7.8% వృద్ధి సాధించిన భారత్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ (Q3) త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.8% వృద్ధి సాధించినట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో వృద్ధి రేటు 7.4%గా నమోదైంది. 2022-23ను కొత్త ఆధార సంవత్సరంగా మార్చి ఈ గణాంకాలను విడుదల చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 7.6% వృద్ధి చెందుతుందని అంచనా. జులై-సెప్టెంబర్ త్రైమాసిక వృద్ధి రేటు 8.2% నుంచి 8.4%కి సవరించబడింది. తొలి త్రైమాసిక వృద్ధి 7.8% నుంచి 6.7%కి తగ్గింది.

సంబంధిత పోస్ట్