TG: సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి ఖమ్మం జిల్లా పొలాలకు అధికారులు నీటిని విడుదల చేశారు. అశ్వాపురం(M) BG కొత్తూరులో మొదటి లిఫ్ట్ పంప్ హౌస్ లోని ఒక మోటారు ఆన్ చేశారు. నాగార్జునసాగర్ నుంచి ఆయకట్టుకు నీటి విడుదల ఆలస్యం అవుతుండటంతో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు విజ్ఞప్తితో మంత్రి ఉత్తమ్ నీటి విడుదలకు ఆదేశించారు. సాగు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని మంత్రులకు రైతులు మొరపెట్టుకోవడంతో నీటిని విడుదల చేశారు.