రూ.130 కోట్లకు అమ్ముడైన గోల్కొండ వజ్రం

గోల్కొండకు చెందిన అరుదైన ‘బల్గారి పింక్‌’ వజ్రం అంతర్జాతీయ వేలంలో సుమారు రూ.130 కోట్ల ధర పలికింది. 24 క్యారెట్ల ఈ వజ్రాన్ని క్రిస్టీస్‌ సంస్థ జెనీవాలో నిర్వహించిన వేలంలో 12.086 మిలియన్‌ స్విస్‌ ఫ్రాంక్‌లకు విక్రయించింది. 1950లలో గోల్కొండ నుంచి కొనుగోలు చేసిన ఈ వజ్రాన్ని ఇటలీలోని బల్గారి సంస్థ ఉంగరంగా రూపొందించింది. దాదాపు 70 ఏళ్లుగా ఒకే కుటుంబం వద్ద ఉన్న దీన్ని తొలిసారిగా వేలానికి తీసుకొచ్చారు. అరుదైన పింక్‌ రంగు, అత్యుత్తమ నాణ్యత కారణంగా క్రిస్టీస్‌ దీన్ని ‘పింక్‌ డైమండ్స్‌లో మోనాలిసా’గా అభివర్ణించింది.

సంబంధిత పోస్ట్

✕
✕