ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 5 రోజుల ముందుగానే అకౌంట్లోకి సెప్టెంబర్ నెల జీతం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్‌. సెప్టెంబర్‌ 28 నుంచి 30 వరకు ప్రతిపాదిత బ్యాంక్‌ సమ్మె నేపథ్యంలో సెప్టెంబర్‌ నెల జీతాలు, పెన్షన్లను ముందుగానే చెల్లించేందుకు కేంద్రం అనుమతించింది. దీంతో సెప్టెంబర్‌ 25 నుంచే చెల్లింపులు చేపట్టవచ్చు. రక్షణ, తపాలా, టెలికమ్యూనికేషన్స్‌ సహా ఇతర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పారిశ్రామిక ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. పెన్షనర్లకు కూడా సెప్టెంబర్‌ 25న పెన్షన్‌ పంపిణీ చేయనుంది.

సంబంధిత పోస్ట్

✕
✕