ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. ఆ పనులు పూర్తి చేయకున్నా బిల్లులు

TG: రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త చెప్పింది. ఇంటి నిర్మాణంలో బయట గోడలకు ప్లాస్టరింగ్​ చేసి, లోపల చేయకున్నా, ముందు దర్వాజ తలుపులు ఉండి, లోపలి గదులకు తలుపులు ఏర్పాటు చేయలేకున్నా, పూర్తి స్థాయి వైరింగ్​, ప్లంబింగ్​ పనులు పూర్తి చేయకపోయినా ఆఖరి బిల్లు కోసం లబ్ధిదారుతో ఉన్న ఇంటి చిత్రాల్ని తీసి బిల్లు కోసం సిఫార్సు చేసేందుకు అవకాశం కల్పించారు. ఈ మేరకు హౌసింగ్​ కార్పొరేషన్​ ఎండీ వీపీ గౌతమ్​ ఉత్తర్వులు జారీ చేశారు. ఇలా చిన్న చిన్న హంగుల కోసం బిల్లులు నిలిపివేసే పరిస్థితి ఇకపై ఉండదని చెప్పారు.

సంబంధిత పోస్ట్