మెట్రో, ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్​న్యూస్.. రూ.4,500లకే కామన్ పాస్!

TG: హైదరాబాద్​ క్యూర్‌ ప్రాంతంలో మెట్రో రైలు, ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మెట్రో, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు ప్రవేశపెట్టిన ఉమ్మడి పాస్‌ ధరలను సగానికి పైగా తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రోజువారీ పాస్‌ను రూ.325కు, నెలవారీ పాస్‌ను రూ.4,000 నుంచి రూ.4,500 మధ్యన అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మెట్రో రైలు, ఆర్టీసీ యాజమాన్యాలు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఉమ్మడి పాస్‌ కొత్త ధరల్ని దీపావళి పండుగ నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్

✕
✕