పీఎఫ్ ఖాతాల్లోకి వడ్డీ డబ్బులు.. చెక్ చేస్కోండి ఇలా!

పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త. ఈపీఎఫ్ఓ (EPFO) తమ ఖాతాల్లో వార్షిక వడ్డీని జమ చేయడం ప్రారంభించింది. జులై 3వ తేదీ నుంచి కొందరి ఖాతాల్లో వడ్డీ జమ అవుతుండగా, మరో 15 రోజుల్లో అందరి ఖాతాల్లో జమ కానుంది. EPFO ఈ ఏడాది 8.25 శాతం వడ్డీని అందించాలని నిర్ణయించింది. కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభమైంది. పాస్‌బుక్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోయినప్పటికీ.. మిస్డ్ కాల్ (9966044425) లేదా SMS (EPFOHO UAN LAN) ద్వారా ఖాతాదారులు తమ పీఎఫ్ బ్యాలెన్స్‌ను సులభంగా చెక్ చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్