ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో సీనియర్ సిటిజన్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించే అవకాశాలున్నాయి. కొవిడ్ మహమ్మారి సమయంలో నిలిపివేసిన రైల్వే ప్రయాణ రాయితీలను తిరిగి అమలు చేసే ప్రతిపాదనపై కేంద్ర ఆర్థిక, రైల్వే మంత్రిత్వ శాఖలు చర్చలు జరుపుతున్నాయని సమాచారం. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే, ఆరేళ్ల తర్వాత వృద్ధులు తక్కువ ఛార్జీలతో రైలు ప్రయాణం చేసే అవకాశం ఉంది. గతంలో సీనియర్ సిటిజన్లకు పురుషులకు 40%, మహిళలకు 50% రాయితీ లభించేది.