తెలుగు రాష్ట్రాల ప్రజలు హోళీ పండుగకు సిద్ధమవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని పాఠశాలలకు మార్చి 14న హోలీ పండుగ సందర్భంగా సాధారణ సెలవును ప్రభుత్వం ప్రకటించింది. కాగా, హోలీ పండుగను రంగుల పండుగ, వసంత పండుగ, ప్రేమ పండుగ అని కూడా పిలుస్తారు. ఈ పండుగ ఏటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున వస్తుంది.