మహిళలకు గుడ్‌ న్యూస్.. 100 శాతం సబ్సిడీతో మరో కొత్త స్కీమ్ (వీడియో)

తెలంగాణ ప్రభుత్వం బీసీ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కొత్త పథకాన్ని ప్రకటించింది. ప్రతి నియోజకవర్గంలో వెయ్యి మంది మహిళలకు 100 శాతం సబ్సిడీతో ఆధునిక ఆటోమేటిక్ కుట్టు మిషన్లు పంపిణీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పథకం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది. ఈ స్కీమ్‌పై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించి అమలు విధానాన్ని పరిశీలించారు. త్వరలోనే దరఖాస్తులు స్వీకరించి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక జరగనుంది.

సంబంధిత పోస్ట్