పీఎఫ్ సేవలను సులభతరం చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. EPFO 3.0లో భాగంగా త్వరలోనే ఏటీఎంల ద్వారా పీఎఫ్ నగదును సెకన్లలో విత్‌డ్రా చేసుకునే సౌకర్యం అందుబాటులోకి రానుంది. ప్రత్యేక ఏటీఎం కార్డుల ద్వారా ఖాతాదారులు తమ పీఎఫ్‌లో 75% వరకు నగదును తీసుకోవచ్చు. ప్రస్తుతం క్లెయిమ్ ప్రక్రియకు పట్టే సమయం తగ్గనుంది. వైద్య, అత్యవసర అవసరాల కోసం ఈ సౌకర్యం ఉపయోగపడనుంది. అలాగే యూపీఐ ద్వారా పీఎఫ్ చందాలు చెల్లించే విధానాన్ని కూడా త్వరలో ప్రవేశపెట్టనుంది.