గుడ్‌న్యూస్.. తునికాకు సేకరణ ధర పెంపు

తెలంగాణలో బీడీ ఆకు సేకరించే కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. తునికాకు సేకరణ ధరను రూ.3,300 నుంచి రూ.3,400కు పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రతి ‘స్టాండర్డ్ బ్యాగ్‌’కు ఈ పెంపు వర్తించనుంది. ఒక స్టాండర్డ్ బ్యాగ్‌లో 50 ఆకుల చొప్పున 1000 కట్టలు ఉంటాయి. 2026 సేకరణ సీజన్ నుంచి అదనంగా రూ.100 చెల్లించనున్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా బీడీ ఆకు సేకరణపై ఆధారపడిన దాదాపు 10 లక్షల మంది కార్మికులకు ఆర్థికంగా లాభం చేకూరనుందని ప్రభుత్వం తెలిపింది.

సంబంధిత పోస్ట్