కార్మిక శాఖ పేరులో మార్పు చేసిన ప్రభుత్వం

TG: రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి రంగాల్లో పరిపాలనా సంస్కరణలకు రేవంత్ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప్రస్తుత కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాల శాఖ పేరును 'డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కిల్ హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్స్' (శక్తి)గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు పరిశ్రమల శాఖ పరిధిలో ఉన్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బాధ్యతలను నూతనంగా ఏర్పాటైన శక్తి శాఖకు బదిలీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ఐటీఐలు, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు, పాలిటెక్నిక్ కళాశాలలు ఇకపై యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి రానున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్