రాజధాని నగరం హైదరాబాద్‌లో మెట్రో రైలును మేడ్చల్, శామీర్‌పేట్‌కు పొడిగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్యారడైజ్ నుంచి మేడ్చల్ (23 కి.మీ.), జేబీఎస్ నుంచి శామీర్‌పేట్ (22 కి.మీ.) వరకు రెండు కొత్త కారిడార్ల DPRల తయారీకి ఆమోదం తెలిపింది. వెంటనే DPRలు సిద్ధం చేసి, కేంద్రానికి పంపాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.